ఆనంద్, వైష్ణవి, సాయి రాజేష్ కాంబో ఫిక్స్… ఈసారి బేబీ మూవీ ని మించేలా…!!

బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి 100 కోట్లు క్లబ్ లో చేరింది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాట్ నటించారు. వైష్ణవి చైతన్యకు, వెండి తెర‌ పైకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. సాయి రాజేష్ కు ప్రముఖ గౌరవాన్ని తీసుకొచ్చింది. నిర్మాత ఎస్.కె.ఎస్ కు అయితే మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఇలా ఒకరికి కాదు.. ఈ అందరి కెరీర్ లనో బేబీ సినిమా నిలబెట్టిందని చెప్పాలి.

ఇప్పుడు ఆ టీం మరో సినిమాను చేసేందుకు ముందుకు వచ్చింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కాంబోలో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాకి సాయి రాజేష్ కథా, కథనాన్ని అందిస్తున్నాడు. కానీ దర్శకత్వం మాత్రం వేరే వ్యక్తి చేస్తున్నాడు. అదొక్కటే ట్విస్ట్. నిర్మాత ఎస్ కే ఎస్ ఈ మూవీని భారీగా నిర్మించబోతున్నాడు. తాజాగా ఈ కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎస్ కే ఎస్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.

కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ తరువాత మళ్లీ మా టీం, మా కాంబో మరోసారి రాబోతుంది. సాయి రాజేష్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. టాలెంటెడ్ పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యాలు ఇందులో నటించిన ఉన్నారు. రవి నంబూరి కొత్త దర్శకుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఎస్ కే ఎస్ ట్వీట్ వేశాడు.