నాని-త‌మ‌న్నా కాంబోలో మిస్‌ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. టాలీవుడ్ లో ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే టైర్ 2 హీరోల‌తోనూ జ‌త‌క‌ట్టింది. కానీ, ఇంత వ‌ర‌కు న్యాచుర‌ల్ నానితో త‌మ‌న్నా సినిమా చేయ‌లేదు. అయితే గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ఓ సూప‌ర్ హిట్ మూవీ మిస్ అయింద‌ని మీకు తెలుసా..? అవును, ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `త‌డాఖా`.

కిషోర్ కుమార్ పార్థాసాని ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య, త‌మ‌న్నా జంట‌గా న‌టించారు. సునీల్, ఆండ్రియా జర్మియా, అశుతోష్ రాణా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ సాయి గణేష్ ప్రోడక్షన్స్ బ్యాన‌ర్ పై బెల్లంకొండ గణేష్ నిర్మించిన త‌డాఖా.. 2013లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ కు నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ ఛాయిస్ కాదు. చైతు కన్నా ముందే త‌డాఖా స్టోరీ నాని వ‌ద్ద‌కు వెళ్లింది. ఆయ‌నకు క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే, అప్ప‌టికే నాని పలు ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయ్యి ఉన్నాడు. దాంతో డేట్స్ ఖాళీగా లేక‌పోవ‌డం వ‌ల్ల సున్నితంగా నాని త‌డాఖాను తిర‌స్క‌రించారు. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌కు స్టోరీ న‌చ్చ‌డంతో వెంట‌నే సినిమాకు ఒప్పుకుని హిట్ కొట్టాడు. అలా నాని, త‌మ‌న్నా కాంబోలో త‌డాఖా వంటి విజ‌య‌వంత‌మైన సినిమా మిస్ అయిపోయింది.