జబర్దస్త్ నటి సత్య శ్రీ ఇంట తీవ్ర విషాదం..!!

తెలుగు బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న షో జబర్దస్త్.. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెర పైన కమెడియన్సుగా హీరోలుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. మరి కొంతమంది పలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ కమెడియన్గా కొనసాగుతూ ఉన్నారు. చాలామందికి సైతం జబర్దస్త్ స్టేజ్ మంచి పేరు తీసుకువచ్చేలా చేసింది. జడ్జిగా నాగబాబు బయటికి వెళ్లడంతో ఆయనతోపాటు చాలామంది కమెడియన్స్ సైతం బయటికి వెళ్లడం జరిగిందట. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు ఈయన వెళ్లడంతో ఈయన స్కిట్లు ఎక్కువగా చేసే సత్య శ్రీ కూడా వెళ్లిపోవడం జరిగింది.

చమ్మక్ చంద్ర గారు తన గురువు అని ఆయన ఎక్కడ ఉంటే తన కూడా అక్కడే ఉంటానని తెలియజేయడం జరిగింది. కొద్ది రోజులపాటు మైంటైన్ చేస్తూ వచ్చిన ఆ తర్వాత ఇప్పుడు చమ్మక్ చంద్ర ను వీడడం జరిగింది. చమ్మక్ చంద్ర సినిమాలలో బిజీగా ఉండడం చేత ఎక్కువగా బుల్లితెర పైన ఫోకస్ పెట్టకపోవడంతో ఈమెకు అవకాశాలు తగ్గుతూ ఉన్నాయని పించి జబర్దస్త్ షో కి వచ్చి కాస్త బిజీగా అయింది.


ఇదంతా ఆమె ప్రొఫెషనల్ లైఫ్ అని కూడా చెప్పవచ్చు.ఈమె పర్సనల్ విషయానికి వస్తే ఈమే ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.ఆమె నానమ్మ తాజాగా మరణించినట్లు ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీస్ లో పంచుకోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సత్య శ్రీ తన నానమ్మ మిస్ అవుతున్నట్టుగా ఆమెతో దిగిన ఫోటోలు సైతం షేర్ చేసింది ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ఫోటో వైరల్ గా మారుతున్నది.