పార్టీని పక్కకు పెట్టి మరి అలాంటి పని చేసిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఇంట పదిరోజుల క్రితం తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది. దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి అక్టోబర్ 9వ తేదీన మరణించారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్యాంసుందర్ రెడ్డి మరణంతో దిల్ రాజు ఒక్కసారిగా కృంగిపోయారు.. చాలామంది దిల్ రాజుని ఓదార్చడం జరిగింది సెలబ్రెటీలు. అలాగే పలువురు సర్ ప్రముఖులు సైతం దిల్ రాజు తండ్రి మృతికి సంతాపాన్ని తెలియజేశారు.

అలా ఇప్పటికే ప్రకాష్ రాజ్, రామ్ చరణ్ తదితరులు సైతం పరామర్శించారు. శ్యామ్ సుందర్ రెడ్డి దిశదిన కర్మను నిర్వహించగా ఈ కార్యక్రమానికి ప్రముఖులు సైతం విచ్చేయడం జరిగింది. గత కొన్ని గంటల క్రితం దిల్ రాజు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి ఆయనను పరామర్శించారు.. శ్యామ్ సుందర్ రెడ్డి కి నివాళులు అర్పిస్తూ దిల్ రాజుతో కొద్దిసేపు మాట్లాడడం జరిగిందట అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ వారు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా గండిపేటలో చాలా గ్రాండ్గా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది.. అక్కడ పార్టీని పక్కకు పెట్టి మరి అల్లు అర్జున్ దిల్ రాజు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించడం జరిగింది. దిల్ రాజుకు అల్లు అర్జున్ కు మధ్య మంచి స్నేహబంధం ఉంది వీరి కాంబినేషన్లో ఎవడు, DJ సినిమాలు సైదా విడుదల కావడం జరిగింది. ప్రస్తుతం దిల్ రాజ్ గేమ్ చేంజర్ అనే సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.