కలెక్షన్స్ విషయంలో అవన్నీ ఫేక్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన నాగవంశి..!!

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి విషయాన్ని నైనా సరే మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేటువంటి నిర్మాతగా పేరుపొందారు సూర్యదేవర నాగవంశీ.. ఎలాంటి విషయాన్ని అయినా సరే ధైర్యంగా చెప్పే ఈయన సితార ఎంటర్టైన్మెంట్ అధినేత గా పేరు సంపాదించారు. ఇటీవలే కోలీవుడ్ హీరో విజయ్ నటించిన లియో సినిమాని తెలుగులో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ లో భాగంగా నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో అక్కడ మీడియా ప్రతినిధులతో ముచ్చటించడం జరిగింది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలలో జెర్సీ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రానికి నిర్మాతలకు డబ్బులు రాలేదని ఇటీవల హీరో నానిని పలువురు జర్నలిస్టులు ప్రశ్నించడం జరిగింది.. ఇదే విషయాన్ని ఇప్పుడు నిర్మాత నాగ వంశి దగ్గర కూడా ప్రస్తావించగా ఈ విషయం పైన కాస్త ఘాటు గానే స్పందించినట్లు తెలుస్తోంది. అసలు మీడియాకు తెలిసే లెక్కలన్నీ నిజము కాదని అవన్నీ కేవలం వదంతులని తెలియజేశారు.. అసలు నిర్మాతలు లెక్కలన్నీ ఎందుకు బయటికి చూపెడతారు అంటూ కూడా ప్రశ్నించారు.

సినిమా కేవలం విజయం సాధించిందా లేదా అనే విషయం మీద మాత్రమే మీడియా వారు ఒక వదంతుని విడుదల చేస్తారు.. మేము చేసేటువంటి వ్యాపారాన్ని రోడ్డుమీదికి ఎందుకు పెట్టుకుంటామని తెలిపారు.. ఎవరికివారు తోచిన విధంగా ఫిగర్ ని బట్టి మీడియా ప్రతినిధులు రాసుకుంటూ ఉంటారని తెలియజేయడం జరిగింది. అసలు విషయాన్ని మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క నిర్మాత మీడియా ప్రతినిధులకు చెప్పలేదు అని తెలిపారు.. ఇక సినిమా నిర్మాణ సంస్థల పోస్టర్ల మీద వేసే నెంబర్ల విషయం పైన మాట్లాడుతూ.
.

నేను ఎంత బిజినెస్ చేశాను ఎంత ఖర్చు చేశాను ఎంత వచ్చిందని విషయాలు జనాలకు ఎందుకండి అదంతా చాలా తలనొప్పి నాకు పోయిన ఎవరూ ఇవ్వరు.. వచ్చిన ఎవరు ఇవ్వరు.. ఒక హీరోని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఎందుకు ఇవన్నీ అంటూ పోస్టర్ల మీద వేసే రికార్డు స్థాయి కలెక్షన్స్ గురించి ఇలా కామెంట్స్ చేశారు.