ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. అయితే హీరోగా కాదండోయ్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోకి అటు దర్శకులు, ఇటు హీరోలు తమ తదనంతరం తమ వారసులను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలామంది తాము ఏ వృత్తిలో కొనసాగుతున్నారో అదే వృత్తిలోనే తమ వారసులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన తనయుడిని ఇండస్ట్రీలోకి తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు త్రివిక్రమ్ తన భార్య సాయి సౌజన్య , కొడుకు రిషి మనోజ్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ముఖ్యంగా సౌజన్య, త్రివిక్రమ్ దంపతుల కుమారుడు రిషికి దర్శకత్వం అంటే ఇష్టమని.. అందుకే రిషి ని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నామని సౌజన్య వెల్లడించారు. ఇకపోతే దర్శకులందరిలో కూడా త్రివిక్రమ్ ది ఒక ప్రత్యేకమైన శైలి అని చెప్పవచ్చు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుబంధంగా ఏర్పడిన సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి సినిమాలు నిర్మించడానికి ఆయన తన భార్య సాయి సౌజన్యను రంగంలోకి దించారు. ఇక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి సౌజన్య రిషి గురించి మాట్లాడుతూ.. తన కొడుకు రిషి మనోజ్ డైరెక్టర్గా పరిచయం కాబోతున్నారని ప్రచారం పై క్లారిటీ ఇచ్చింది.

రిషికి దర్శకత్వం అంటే ఆసక్తి ఉంది. ఫిలిం మేకింగ్ లో ఎలా చేయాలో ప్రస్తుతం రిషి తెలుసుకుంటున్నాడు అంటూ ఆమె వెల్లడించారు. ఇకపోతే రిషి మనోజ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఈ ఫోటోని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కుమారుడు, నటుడు అయినా రాజా చెంబోలు తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పంచుకోవడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. మొత్తానికైతే రిషి మనోజ్ తన తండ్రిలాగే మరొక గ్రేట్ డైరెక్టర్ అవుతారేమో చూడాలి.