చైతు కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్న రానా.. కామెంట్స్ వైరల్..!!

దగ్గుబాటి రానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ప్రతి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ సాధిస్తున్నాడు. ఇక స్క్రిప్ట్ నచ్చితే విలన్ క్యారెక్టర్ కైనా ఓకే చెప్పడంలో రానా ముందు వరుసలో ఉంటాడు. గతంలో బాహుబలి సినిమాలో విలన్ రోల్‌లో నటించిన రానా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా నేగిటీవ్‌ రోల్‌లో నటించాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ రాణిస్తున్న రానా.. వెంకటేష్ తో కలిసి రానా నాయుడు సినిమాలో నటించాడు.

ఇక రానా పర్సనల్ లైఫ్ కోస్తే దగ్గుబాటి కుటుంబంలో మొదటి వారసుడిగా రానా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా రానా పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉండేవారు. అలాగే సురేష్ బాబు సోదరి కుమారుడైన నాగచైతన్య విషయంలో కూడా అందరూ అంతే ప్రేమను చూపించేవారు. ఈ క్రమంలో నాగచైతన్య‌ రానాకి మ‌ధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. నాగచైతన్యకు తనకున్న బాండింగ్ గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. మీడియా నుంచి మీరు.. నాగచైతన్యతో ఎలా ఉంటారు మీ ఇద్దరి మధ్యన బాండింగ్ ఏంటి అనే ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ మా ఇంట్లో నా తర్వాత పుట్టినది నాగచైతన్య దీంతో చైతుని కూడా అందరూ చాలా ప్రేమగా చూస్తారు.

ఇక చిన్నప్పటి నుంచి కూడా నేను నాగచైతన్య ఇద్దరం కలిసిపెరిగాం. ఇద్దరు విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నాము. నాకు ఏదైనా హెల్ప్ కావాలంటే కచ్చితంగా చైతు చేస్తాడు. అలాగే నాగచైతన్య కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాను అంటూ రానా వివరించాడు. ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు వెంటనే పుట్టడంతో మా ఇద్దరి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చిన రానా.. రామ్ చరణ్ కు సంబంధించి కూడా ఎన్నో విషయాలను వివరించాడు.

రామ్ చరణ్ అంటే కూడా నాకు చాలా ఇష్టమని మేమిద్దరం కూడా మంచి స్నేహితులమంటూ వివరించాడు. దీంతో మీడియా నుంచి మీకు రామ్ చరణ్ , నాగచైతన్యలో ఎవరంటే ఎక్కువ ఇష్టమంటూ ప్ర‌శ్న వినిపించ్చింది. ఇష్టం ఎప్పుడు ఒకేలా ఉండదు మారుతూ ఉంటుంది కాకపోతే రామ్ చరణ్ కూడా మా ఫ్యామిలీలో మెంబర్ లాగే.. మాతో కలిసి పోతాడు మేమందరం ఎప్పుడూ మంచి బాండింగ్ కలిగి ఉంటామంటూ వివరించాడు. ప్రస్తుతం రానా.. నాగచైతన్య, రామ్ చరణ్ గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.