అలాంటి జబ్బుతో బాధపడుతున్న పాయల్ రాజ్ పుత్.. ఆందోళనలో ఫ్యాన్స్..!

ప్రముఖ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే తనలోని అందాలను మొత్తం బయటపెట్టి కుర్ర కారులో మంటలు రేకెత్తించింది. అంతేకాదు చివరిలో విలన్ క్యారెక్టర్ రివీల్ చేసి తనలో ఉన్న మరో కోణాన్ని చూపించి.. అందరి చేత శభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా మంచి విజయం సాధించింది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

దాంతో సోషల్ మీడియాకే పరిమితమైన పాయల్ ఎక్కువగా బోల్డ్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. ఇదిలా ఉండగా ఈమె తాజాగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను అంటూ వెల్లడించి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ దర్శకత్వంలో వస్తున్న రెండవ సినిమా మంగళవారం.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పాయల్ తాను ఎదుర్కొన్న అనారోగ్య సమస్య గురించి వెల్లడించింది.

పాయల్ మాట్లాడుతూ.. అజయ్ నా దగ్గరకు మంగళవారం సినిమా కథతో వచ్చినప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నాను. అయితే అప్పటికి ఎవరికి ఈ విషయం గురించి తెలియదు.అయితే ఈ సమస్యను పరిష్కరించాలంటే వైద్యులు సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. ఇక మందులు వాడుతున్నా కూడా సర్జరీ తప్పనిసరి అని తేలింది. అయితే అదే సమయంలో అజయ్ అడగడంతో మరొకవైపు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను అంటూ ఆమె తెలిపింది. అయితే ఇప్పుడు ఆ సర్జరీ పూర్తయిందా లేదా అన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. పాయల్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని తెలపడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తూ.. త్వరగా సర్జరీ చేయించుకొని ఆ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.