ప్రభాస్ పక్కన నటించి పెద్ద తప్పు చేశా.. నటి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్.. రాజమౌళి డైరెక్షన్లో తెర‌కెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌తో ఎప్పుడు ఎప్పుడు సినిమాలు చేద్దామాఅని చాలామంది హీరోయిన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో అనవసరంగా సినిమాలో నటించాను అంటూ ఇప్పటికీ బాధపడుతుందట. ఇంతకీ ఎవ‌రా హీరోయిన్‌..? అసలు ఎందుకు అలా అనుకుంటుంది..? అనుకుంటున్నారా.. ఆమె శ్రద్ధ కపూర్.

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహూ సినిమాలో శ్రద్ధ కపూర్.. ప్రభాస్ సరసన నటించింది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ సౌత్ ఇండస్ట్రీలో ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో నిరాశ చెందిందట. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన నటిస్తున్నాను కాబట్టి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ వస్తుందని భావించిన ఆమె ఆ సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ కావడంతో ఆమె కలలన్నీ విఫలమయ్యాయి. అప్పటికే శ్రద్ధ కపూర్ స్నేహితుడు ఆమెకు ఈ సినిమా వద్దు ఈ సినిమా ఫెయిల్ అయ్యేలా ఉంది అని సజెషన్ ఇచ్చాడట.అయినా సరే శ్ర‌ద్దా వినకుండా ఆ సినిమాలో న‌టించింది.

ఈ సినిమా ఫ్లాప్ కావడంతో తన స్నేహితుడు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది. ప్రభాస్ సినిమాలో అనవసరంగా నటించాను అంటూ బాధపడుతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పాహో ఫ్లాప్‌తో అప్పటినుంచి సుజిత్‌కి సినిమా అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – సుజిత్ స్క్రిప్ట్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సుజిత్ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారైనా సుజిత్ ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.