వరుణ్ సందేశ్ భార్య వితికకు అలాంటి భ‌యంక‌ర‌మైన వ్యాది ఉంద‌ట‌..?

ప‌డానండి ప్రేమలో మరి అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది వెతికాషేర్. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఈమె అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే సమయంలో వరుణ్ సందేశను ప్రేమించి వివాహం చేసుకున్న వితికా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతుంది. సినీ కెరీర్‌లో మాత్రం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు ఈ జంట. కానీ అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం రావడంతో ఆటలో తమ సత్తా చూపించారు. ఈ షో ద్వారా పాపులర్ అయిన వరుణ్ వితికా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు.

వితికాషేర్‌ సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకుంటూ సంపాదన మొదలుపెట్టింది. ఇక తాజాగా వెతికాషేర్‌ మాట్లాడుతూ తన అనారోగ్యానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె తీవ్రమైన మైగ్రేన్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నానని చెప్పుకొచ్చింది. కారణంగా విపరీతమైన తలనొప్పితో పాటు వెన్నుపోటు కూడా వస్తుందని.. అలాగే స్పాండిలైటిస్ వ్యాధి కోసం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాన‌ని వివ‌రించింది.

తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న తాను ఇటీవల నీడిల్ చేయించుకున్నానని ఈ ట్రీట్మెంట్ తర్వాత కాస్త ఉపసంహంగా అనిపించిందని అయితే మళ్లీ గత రెండు వారాలుగా ఈ మైగ్రేన్ తెగ ఇబ్బంది పెడుతుందని.. విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నానని తెలియజేసింది. అయితే ఆమె బాధపడుతున్న ఈ వ్యాధి నుంచి పూర్తిగా తప్పించుకోలేదు కానీ మెడిసిన్ తీసుకోవడం వల్ల కొంతవరకు నయం కావచ్చు అంటూ వివరించింది. ప్రస్తుతం వితికాషేర్‌ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.