అఖిల్ జాతకం పై మరో హాట్ బాంబ్ పేల్చిన వేణు స్వామి..జాతకం లో ఇది తప్పదంటూ..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి వారి వ్యక్తిగత విషయాలను వారి జాతక విషయాలను బయటపెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముఖ్యంగా 90% వేణు స్వామి చెప్పిన మాటలు ఈ సెలబ్రిటీల విషయంలో నిజమైన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కినేని కుటుంబ వారసుడిపై ఆయన చేసిన కామెంట్లు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకెళితే అక్కినేని కుటుంబంలో అక్కినేని నాగచైతన్య ఆయన భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకోబోతున్నారని చెప్పి హాట్ బాంబు పేల్చారు. అయితే ఈ విషయాన్ని ఎవరు నమ్మలేదు. కానీ కొన్ని రోజులకు వారి జాతకం ప్రకారం వారిద్దరూ విడిపోవడం జరిగింది. దాంతో వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కలుస్తారంటూ వార్తలు వచ్చినా.. ఈ విషయంపై స్పందించిన వేణు స్వామి ఇక జీవితంలో వారు కలవరు అంటూ షాకింగ్ కామెంట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా మరొకవైపు అక్కినేని అఖిల్ గురించి కూడా ఆయన హాట్ కామెంట్లు చేశారు.

ప్రస్తుతం అక్కినేని కుటుంబంలో రెండు పెళ్లిళ్లు కలిసి వస్తాయని చెప్పిన ఈయన.. నాగార్జున కూడా అమలను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరొకవైపు నాగచైతన్య కూడా సమంతను దూరం చేసుకున్నారు. ఆయన కూడా మళ్లీ పెళ్లికి సిద్ధమవుతారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలోనే అఖిల్ కెరియర్ ఏ మాత్రం బాగోలేదని చెప్పాలి. సినిమా పరంగా కానీ వ్యక్తిగత జీవితంపరంగా కానీ ఆయన సక్సెస్ సాధించడం లేదు. ఇదివరకే నిశ్చితార్థం చేసుకొని పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే ఆగిపోయారు. ఇప్పుడు కెరియర్ కూడా ఆయనకు కలిసి రాలేదు కారణం తల్లిదండ్రుల జోక్యం అని తెలుస్తోంది. నాగార్జున అమల లు రవిచంద్రులు లాంటి వాళ్లు అని , అందులో అమలా ప్రమేయం అఖిల్ విషయంలో ఎక్కువగా ఉంది అని, అమలాను అఖిల్ ఫాలో అయ్యేంతవరకు కెరియర్ లో సక్సెస్ రాదు అని ఇక నాగార్జున అఖిల్ కెరియర్ లోకి వస్తే అఖిల్ తప్పకుండా సక్సెస్ అవుతారని తెలిపారు వేణుస్వామి.