అప్పుడు టోటల్ గ్రాస్ రూ.18 కోట్లు.. ఇప్పుడు ఒక్కరోజు కలెక్షన్స్ రూ.18 కోట్లు బాలయ్య ఎదిగిన తీరు అమోఘం..

ఇటీవల బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు టార్గెట్ రూ.70 కోట్లు కాగా ఇప్పటికే 40% టార్గెట్ ను రీచ్ అయింది. ఇక ఈ మూవీ డామినేషన్ ఏ రేంజ్ లో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు అన్న సంగతి తెలిసిందే. రూలర్, జై సింహ సినిమాలకు టోటల్ కలెక్షన్ రూ.18 కోట్లు కాగా భగవంత్ కేసరి కి కేవలం ఒక్కరోజులోనే ఆ టార్గెట్ అధిగమించాడు.

బాలయ్య గత సినిమా వీరసింహారెడ్డి ఫస్ట్ డే కలెక్షన్ దాదాపు రూ.30 కోట్ట‌ రేంజ్ లో ఉన్నాయి. వరుస ప్లాపులు వస్తున్న సమయంలో నిరాశ చెందకుండా కథలు, దర్శకుల ఎంపికలో ఆచితూచి అడుగుల వేసి వరుస విజయాలను అందుకుంటున్నాడు. మూవీ క్రిటిక్స్ కూడా దసరా విన్నర్గా భగవంత్‌ కేసరి ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉండడంతో ఈ సినిమా కచ్చితంగా రూ.100 కోట్ల కలెక్షన్ మార్క్‌ను అందుకుంటుంది అంటూ ఆశ భవాని వ్యక్తం చేస్తున్నారు నెట్టిజన్లు. ఇక బాలయ్య తీసుకుంటున్న కథలను కూడా నెక్స్ట్ లెవెల్ లో సెలెక్ట్ చేసుకుంటూ సినిమాల్లో నటించి హిట్లను తన ఖాతాలు వేసుకుంటున్నాడు. ఇక బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి హిట్ కావ‌డంతో బాల‌య్య ఫ్యాన్స్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.