టెన్నిస్ బంతుల పాపగా మారిపోయిన పూజా హెగ్డే.. మినీ ఫ్రాక్‌ లో ఏం ఉంది రా బాబు!

అందం, టాలెంట్ కు అదృష్టం కూడా తోడవడంతో ముంబై బ్యూటీ పూజా హెగ్డే అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయింది. టాప్ స్టార్స్ కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరుస విజయాలతో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్న తరుణంలో పూజా హెగ్డేకు బ్యాడ్‌ టైం మొదలైంది.

గ‌త‌ ఏడాది నుంచి ఈ బుట్టబొమ్మ ఏ సినిమాలో నటించినా.. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూనే వచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు దాదాపు అర డజన్ చిత్రాలు పరాజయం పాలవడంతో పూజా హెగ్డే కెరీర్ డేంజ‌ర్ జోన్ లో ప‌డింది. దీనికి తోడు చేతిలో ఉన్న గుంటూరు కారం, ఉస్తాద్‌ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులు కూడా జారాయి.

దీంతో ఆఫర్లు లేక కాళీ అయిపోయిన పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. గ్లామరస్‌ ఫోటోషాట్లతో మళ్ళీ అవకాశాలు ద‌క్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా పూజా హెగ్డే టెన్నిస్ బంతుల పాపగా మారిపోయింది. గ్రీన్ కలర్ మినీ ఫ్రాక్ ధరించిన పూజా హెగ్డే.. టెన్నిస్ కోర్టులో బ్యాట్ బ‌ట్టి బంతాడేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వీటిని చూసి కుర్రాళ్లు డ‌స్కీ బ్యూటీ అందాల‌కు ఫిదా అయిపోతున్నారు. మినీ ఫ్రాక్ లో పూజా ఏం ఉంది రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)