బిగ్ బాస్ రీఎంట్రీ కోసం ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ ని రిజెక్ట్ చేసిన రతిక..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక్కడికి వచ్చిన చాలామంది కంటెస్టెంట్లు.. కోట్లాదిమంది తెలుగు ఆడియోస్ కి మరింత చేరువవడమే కాకుండా సినిమాలో అవకాశాలను ద‌క్కించుకుంటూ బిజీ అయి తమ నటనతో స్టార్‌డంను సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. ఇలాగే చాలామంది సక్సెస్ అయ్యారు. ఇక ఇటీవల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది హాట్ బ్యూటీ రతిక ప్రస్తుతం ఆమెకి క్రేజ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. ఇక నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిన రతిక హౌస్ లో ఉన్న నాలుగు వారాలు తన అందంతో కుర్రాళ్ళ‌ని కట్టిపడేసింది.

హాట్ గా ఉన్న ఈ అమ్మాయి హీరోయిన్గా ఎందుకు అవ్వలేదు అంటూ చాలామంది కామెంట్ చేశారు. అయితే ఈటీవీలో ప్రసారమయ్యే పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ర‌తీక మొదట్లో ప్రియాంక పేరుతో పిలవబడింది. తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు. కానీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. రీసెంట్‌గా బాలయ్య భగవంత్ కేసరి సినిమాలో చిన్న పాత్రలో నటించింది.

ఈ మూవీలో కేవలం కనిపించింది 5 నిమిషాలైనా ఆమెకున్న క్రేజ్ రిత్యా బాగా పాపులర్ అయిపోయింది. అయితే ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఈమె తీసుకునే క్యారెక్టర్ లో చేయడానికి వచ్చిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చిందట. నవంబర్ నెలలో డేట్స్ ఇవ్వమంటూ హరీష్ శంకర్ ఆమెను అడగగా ఆమెకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి ఏంట్రీ ఇచ్చే ఛాన్స్ దొరకడంతో రతిక పవన్ కళ్యాణ్ తో డాన్స్ చేసే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట.

సినిమాల్లో వరుసగా ఆఫర్స్ వస్తున్నా కూడా మళ్లీ బిగ్‌బాస్ రీ ఎంట్రీ కోసం అన్ని ఆఫర్స్ ని పక్కన పెడుతున్న రతిక ఈ సారి ఆట ఎలా ఆడుతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ లాంటి హీరో తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోవడానికి నువ్వేమైనా అప్సరసవి అనుకుంటున్నావా.. నీకు అసలు ఛాన్స్ రావడమే ఎక్కువ మళ్ళీ నువ్వు ఆ ఛాన్స్ ని రిజెక్ట్ చేసావా అంటూ.. నీకు అంత సీన్ లేదు అంటూ.. ఫైర్ అవుతున్నారు పవన్ ఫ్యాన్స్.