ఈ దసరా పండుగకు మూడు పెద్ద సినిమాలు పోటీ పడ్డ సంగతి తెలిసిందే. అందులో నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి ఒకటి కాగా.. మరొకటి రవితేజ టైగర్ నాగేశ్వరరావు. ఇంకొకటి ఇళయదళపతి విజయ్ `లియో`. భగవంత్ కేసరి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక లియో యాక్షన్ మూవీ అయితే.. టైగర్ నాగేశ్వరరావు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది.
ఈ రెండు సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. టాక్ ఎలా ఉన్నా దసరా పండుగ అడ్వాంటేజ్ తో వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. అయితే సరిగ్గా గమనిస్తే.. కథ, కథాంశం వేరైనా ఈ మూడు సినిమాల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. భగవంత్ కేసరి-లియో-టైగర్ నాగేశ్వరరావు.. ఈ మూడు సినిమాల్లో యాదృశ్చికంగా దర్శకులు నెగిటివ్ క్యారెక్టర్ ని బలంగా చూపించడం కోసం ఒకే తరహా సీన్స్ ను రాసుకున్నారు.
భగవంత్ కేసరిలో విలన్ అర్జున్ రాంపాల్ నెంబర్ వన్ బిజినెస్ మెన్ గా ఎదగడం కోసం కన్న కొడుకునే చంపేస్తాడు. లియోలో తన వ్యాపార వృద్ధి కోసం కొడుకు, కూతురుని నరబలి ఇవ్వాలని అనుకునే తండ్రిగా సంజయ్ దత్ ను చూపించారు. ఇక టైగర్ నాగేశ్వరరావులో కూడా తండ్రి తలని కొడుకు నరికేస్తాడు. మొత్తానికి అలా దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాలలో ఒక సన్నివేశం మాత్రం కామన్ గా ఉండటం విశేషంగా మారింది.