నాని – ప్రియాంక మోహన్ కాంబోలో మరో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం హాయ్ నాన్న మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో బిజీగా ఉన్నాడు నాని. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫాదర్ సెంటిమెంట్తో తర్కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తూనే మరోవైపు కొత్త సినిమాలు పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నాచురల్ స్టార్. ఇక ఈ దసరా సందర్భంగా నాని కొత్త సినిమా ప్రారంభం కాబోతుంది.

వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో నాని సరసన జంటగా ప్రియాంక మోహన్ అనుకుంటున్నారట. ప్రస్తుతం అదే ఆలోచనతో చర్చలు కొనసాగుతున్నాయని టాక్. ఇక ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ జంట రొమాన్స్ తోను ఎమోషనల్ సీన్స్ తాను అదరగొట్టారు.

ఈ సినిమాతో నాని ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాతో సందడి చేసిన ఈ జోడి మరోసారి యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.