బాడీ షేపులు చూపిస్తూ జాన్వీ క‌పూర్ టెంప్టింగ్ ఫోజులు.. స్ట‌న్ అయిపోతున్న కుర్రాళ్లు!

సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియాలో అందాల ఆరబోతతోనే ఎక్కువ ఫేమస్ అయిన హీరోయిన్లలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఒకటి. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ స్టార్ కిడ్.. స్కిన్ షో విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేదు. చూపించాల్సిన అందాలన్నీ చూపించేస్తూ భారీ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్రౌన్ కలర్ స్కిన్ టైట్ దుస్తుల్లో షాపులు చూపిస్తూ సూపర్ టెంప్టింగ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ తో కుర్రాళ్ళను నిలువునా ముంచేసింది. నాగు పాములా మెలికలు తిరుగుతూ నిషా పుట్టించింది. జాన్వీ తాజా ఫోటోలు నెట్టింట‌ వైరల్ గా మారడంతో.. వాటిని చూసి కుర్రాళ్ళు స్టన్‌ అయిపోతున్నారు. చూపు తిప్పుకోలేకపోతున్నారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో పలు చిత్రాలు చేస్తున్న జాన్వీ కపూర్.. త్వరలోనే దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం చిత్రీకరణ ద‌శ‌లో ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)