`భ‌గ‌వంత్ కేస‌రి`లో ఈ మిస్టేక్ ను గ‌మ‌నించారా.. అనిల్ రావిపూడి కూడా చూసుకోలేదు పాపం!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. మోస్ట్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కించ‌గా.. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అక్టోబ‌ర్ 19న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందు పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ముఖ్యంగా ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చ‌గా సినిమా నచ్చేసింది. విమెన్ ఎంపవర్మెంట్, బ‌ల‌మైన ఎమోషన్స్, యాక్షన్, కామెడీ, ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో భారీ పోటీ ఉన్నా కూడా భ‌గ‌వంత్ కేస‌రి బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను అందుకుంటోంది. ఇక‌పోతే సినిమా అన్నాక కొన్ని కొన్ని త‌ప్పులు ఉండ‌టం కామ‌న్‌. స‌రిగ్గా గ‌మ‌నిస్తే.. భ‌గ‌వంత్ కేస‌రిలోనూ ఓ మిస్టేక్ ఉంది. అదే ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారింది.

భ‌గ‌వంత్ కేస‌రిలో శ్రీ‌లీల తండ్రిగా జైల‌ర్ పాత్ర‌లో శ‌ర‌త్ బాబు న‌టించారు. సినిమా స్టార్ట్ అయిన కాసేప‌టికే ఓ యాక్సిడెంట్ లో శ‌ర‌త్ బాబు పాత్ర చ‌నిపోతుంది. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ లో సీఐ మరణం అని స్క్రోలింగ్ వేశారు. ఈ చిన్న మిస్టేక్ ను గుర్తించిన నెటిజ‌న్లు.. సోష‌ల్ మీడియా వేదిక‌గా జైల‌ర్ అంత‌లోనే సీఐ ఎలా అయ్యాడు అనిల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో ఇదే విష‌యాన్ని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌స్తావించ‌గా.. `అంత పెద్ద కమర్షియల్ సినిమాలో మీరు ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం గొప్ప విషయం. జైలర్ ని సీఐ అని న్యూస్ చెప్పడం మా తప్పే. మావాళ్లు పొరపాటుగా అలా వేసి ఉంటారు. అందుకు క్షమాపణలు` అంటూ అనిల్ పేర్కొన్నారు. మొత్తానికి అనిల్ కూడా ఆ మిస్టేక్ ను నెటిజ‌న్లు గుర్తించే వ‌ర‌కు చూసుకోలేద‌ని స్ప‌ష్టంగా తేలిపోయింది.