బిగ్‌బాస్ హౌస్ కాదు అది భాయ్స్ హాస్ట‌ల్‌… మ‌ళ్లీ లేడీ కంటెస్టెంట్‌ను పంపేస్తున్నారుగా..!

బిగ్‌బాస్ 7 సీజన్లో మరో షాకింగ్ ఎలిమినేషన్ తప్పేలా కనిపించడం లేదు. సాధారణంగా ఆదివారం ఇంటి నుంచి బయటకు పంపిస్తూ ఉంటారు. కానీ ఈసారి అది శనివారం ఉండనుందట. అలానే వరుసగా ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. ఇది మాత్రం ఓరకంగా ట్విస్ట్ అనే చెప్పొచ్చు. బిగ్ బాస్ లో అసలేం జరుగుతుంది? ఈసారి నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. పల్లవి ప్రశాంత్ , అమర్, తేజ, గౌతమ్, పూజ, అశ్విని, భోలె నామినేషన్స్ లో ఉన్నారు.

వీళ్ల‌లో ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ టాప్ లో ఉన్నారు. మిగిలిన ఐదుగురు లో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది బుధవారం నుంచి చాలా సస్పెన్స్ గా అనిపించింది. ఇక ఈ వారం నామినేషన్స్ సందర్భంగా బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేషన్ తెప్పించి భోలె.. ఈసారి నామినేట్ అయిపోతాడని అందరూ అనుకుంటున్నారు. కానీ తర్వాత అతడు ఓటు బ్యాంక్ పెంచుకుని ఏకంగా మూడో స్థానానికి వచ్చేసాడు. గౌతమ్ మాత్రం మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయాడు.

నాలుగో స్థానంలో తేజ ఉన్నాడు. ఇక చివరి రెండు స్థానాల్లో అశ్విని, పూజ ఉన్నారు. వీళ్ల‌లో ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే పూజకే తక్కువ శాతం ఓటింగ్ ఉంది. దీంతో ఈసారి ఆమె నామినేట్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరుసగా ఆరు వారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ నీ ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. మళ్లీ ఇప్పుడు కూడా అమ్మాయేనా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.