సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో కనిపించిన ఈ చైల్డ్ యాక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు నటించడం జరిగింది.. సమంత అంజలి హీరోయిన్స్ గా నటించారు.అయితే ఇందులో చాలామంది యాక్టర్స్ కూడా నటించడం జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కించిన ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో గోదావరి భాష లో ప్రతి ఒక్కరు కూడా ఆకట్టుకున్నారు. అచ్చ తెలుగు అందం ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల.

ఇందులో చైల్డ్ యాక్టర్ గా నటించిన అమ్మాయి పేరు రచన..ఈమె పలు సన్నివేశాలలో ఈ సినిమాలో కనిపించడం జరిగింది. ఇటీవల రీల్స్ లో మళ్ళీ ఫేమస్ అవ్వడంతో రచన మరింత పాపులారిటీ అందుకుంది. అయితే రచన గురించి అభిమానులు సైతం తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. అయితే రచనకు వివాహం అయ్యి ఒక పాపతో హ్యాపీగా కుటుంబ లైఫ్ని గడిపేస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ అందుకున్నది.

అవకాశాలు వస్తే చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నానంటూ సొంతంగానే ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టింది. అయితే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఈమెకు అవకాశం రావడానికి ముఖ్య కారణం శ్రీకాంత్ అడ్డాలనేట.. ఈ అమ్మాయి కి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మామయ్య వరుస అవుతారట.. ఈ సినిమాలో రచన మాట్లాడే తీరు అందరిని ఆకట్టుకుంది. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసి రచన అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది మళ్లీ ఇన్ని రోజులకు తన మామయ్య తో కలిసి ఫోటోలను దిగి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.