విదేశాల నుంచి వ‌చ్చేసిన సామ్‌.. ఇప్పుడు మిగిలిన ఆప్ష‌న్ ఒక్క‌టే ( వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొద్దికాలంగా మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొత్తానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే వ్యాధికి చికిత్స చేపించుకుంటుంది. అమెరికాలో ఆమె చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సామ్ విదేశాల నుంచి ఇండియా తిరిగి వచ్చేసింది.

దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఈ ముద్దుగుమ్మ ల్యాండ్ అయింది. వైట్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో అది చూసిన ప్రేక్షకులు సమంత మయోసైటీస్ నుంచి కోలుకుందని ఆనంద పడుతున్నారు. అలాగే మళ్లీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుందా? లేదా అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక సమంత యాక్టింగ్‌ను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అలాగే తాజాగా విడుదలైన ” ఖుషి ” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. మరి అదే జోష్లో కొనసాగుతుందో లేదో చూడాలి మరి.

 

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)