తీవ్ర అనారోగ్యం పాలైన రాజా రాజా చోర బ్యూటీ.. హస్ప‌ట‌ల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ.. ?

హీరోయిన్ సునైనా రాజ రాజ చోరా సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సునయన తర్వాత టాలీవుడ్‌లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవల ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చేతికి సెలైన్ పెట్టుకొని ఆసుపత్రి బెడ్ పై దిగిన ఫోటోను షేర్ చేస్తూ త్వరలోనే దృఢంగా తిరిగి వస్తాను అంటూ ట్యాగ్ చేసింది.

అయితే ఏ వ్యాధి కారణంగా ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుందో అనే విషయాన్ని వివరించలేదు. ఎంతో నీర‌సంగా చింపురు జుట్టుతో ఆ పిక్‌లో క‌నిపించింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ సునైనా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి కొంతమంది ఆమెకు ఏదో చిన్న ఫీవర్ వచ్చి ఉంటుంది అని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఎలాంటి ఇబ్బంది వచ్చిందో.. అది సులువుగా తగ్గేదైనా లేదా భయంకరమైన వ్యాధి ఏదైనాన అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరి కొంతమంది ఇది ఏదైనా మూవీ లో సీనై ఉంటుందని భావిస్తున్నారు. ఇక 2005లో నటిగా ఎంట్రీ ఇచ్చిన సునైనా తమిళ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. తాజాగా ఆమె నటించిన మూవీ రెజీనా.. ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ పిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.