చరణ్‌కు రెండో భార్య‌గా ఆ హాట్ హీరోయిన్‌… పెళ్లి కూడా అయిపోయింది..!

యంగ్ బ్యూటీ గాయత్రీ భరద్వాజ్ 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత మిస్ యూనైటెడ్ కంటినెంట్స్ గా కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులని అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.

 

ఈ సినిమా నిన్న (అక్టోబర్ 20న) గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న గాయత్రీ భరద్వాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాయత్రీ భరద్వాజ్ మాట్లాడుతూ..” నేను రామ్ చరణ్ కు పెద్ద ఫ్యాన్ను.

పెళ్లి చేసుకోవాలని కూడా అనుకునే దాన్ని అని చెప్పగా.. దానికి యాంకర్ చరణ్ కి ఆల్రెడీ పెళ్లైపోయింది కదా అని ప్రశ్నించాడు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. కానీ నా కలల్లో, ఊహల్లో ఎప్పుడో ఆయనను పెళ్లి చేసుకున్నాను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గాయత్రీ భరద్వాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.