టైగర్ నాగేశ్వరరావు కోసం రవితేజ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

టాలీవుడ్ హీరో రవితేజ నటించిన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న రవితేజ పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రవితేజ ఆ తర్వాత ఏప్రిల్ 7వ తేదీన రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈసారి పాన్ ఇండియా లేవల్లో సక్సెస్ కావాలని టైగర్ నాగేశ్వరరావు సినిమాని భారీ అంచనాల మధ్య విడుదల చేశారు ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

డైరెక్టర్ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మంచి టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే వస్తాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇందులో రేణు దేశాయ్ కీలకమైన పాత్రలో నటించింది. 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కోసం రవితేజ రెమ్యూనరేషన్ భారీగానే తీసుకున్నట్టు సమాచారం.

గతంలో ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేవారట. కానీ ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమాని విడుదల చేస్తూ ఉండడంతో టైగర్ నాగేశ్వరరావు సినిమా కోసం ఏకంగా 20 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి వస్తున్న టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పరంగా భారీగానే సాధించడం ఖాయమని అభిమానులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.