ఆయన్ని డైరెక్ట్ చేయడం అంటే ప్రపంచానికి పాఠాలు చెప్పినట్లే.. కాకీ మూవీ డైరెక్ట‌ర్ కామెంట్స్..

హీరో కమలహాసన్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన అన్ని క్యారెక్టర్ల ప్రయోగాలు ముందే చేసేసాడు. కొత్తగా చేయడానికి ఏమీ లేదు అనేది సినీ మేధావులతో పాటు కామన్ ప్రేక్షకులు అభిప్రాయం కూడా. నిజానికి కమల్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ విక్రమ్ కూడా ఆయనకు కొత్త పాత్ర కాదు గతంలో ఇలాంటి సినిమాలు ఎన్నో చేశాడు. కాకపోతే కథ పాతదైన కొత్తగా చెప్పడం పాత్ర పాతదైన కొత్తగా డిజైన్ చేయడం ఇదే కమల విషయంలో డైరెక్టర్ చేస్తున్న పని. ప్రస్తుతం కమల్ స్క్రిప్ట్ పైన డైరెక్టర్ హెచ్ వినోద్ చాలా కష్టపడుతున్నాడు.

తమిళంలో చద‌రంగ విట్టై లాంటి విభిన్నమైన సినిమాకు దర్శకత్వం వహించి.. కార్తీతో కాకీ లాంటి విజయాన్ని అందుకున్న వినోద్ తర్వాత కమలహాసన్‌కు యాక్షన్ చెప్పనున్నారు. కమల్ డేట్స్ ఇచ్చినప్పటి నుంచి దాదాపు మూడేళ్లుగా ఈ కథపై కసరత్తులు చేస్తున్నాడు డైరెక్టర్ వినోద్. ఈలోపు విక్రమ్‌ వచ్చేసింది. మరోవైపు భారతీయుడు 2 కూడా రిలీజ్ అవుతుంది. వినోద్ మాత్రం ఇంకా లేట్ చేస్తూనే ఉన్నాడు కారణంగా పాన్‌ ఇండియా మూవీ కల్కి కి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ వెనకే మణి రత్నం సినిమాకు కూడా ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.

దీంతో ఇక ఆలస్యం చేయకూడదని భావించిన వినోద్ కథని లాక్ చేశాడట. కల్కి తర్వాత కమల్ హాసన్ చేయబోతున్న సినిమా వినోద్ డైరెక్షన్లోనే అనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. కమల్ హాసన్ కెరీర్ లోనే పూర్తి విభిన్నమైన కథతో ఇది తెరకెక్కనుందట. ఆయన చేయని పాత్ర లేదు చెప్పని కధ లేదు. ఆయన దర్శకత్వం చేయడం అంటే యూనివర్సిటీకి పాఠాలు చెప్పడమే కనుక ఈ తిప్పలన్నీ పడుతున్నాను అంటూ డైరెక్టర్ వివరించాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.