అవును, ఈ మధ్య మన తెలుగు పరిశ్రమలో కుర్ర దర్శకుల హవా కాస్త ఎక్కువైందనే చెప్పుకోవాలి. దానికి కారణం ఒక్కటే. ఒకప్పటికీ, ఇప్పటికీ సినిమా చూసే ప్రక్షకుల పంథాలో మార్పు వచ్చింది. కధ, కధనం బావుంటేనే సినిమా చూస్తున్నారు, లేదంటే లేదు. అందుకే ఇక్కడ హీరోలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కధల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మన హీరోలు ఎక్కువగా కుర్ర దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అవును, ఈ జనరేషన్ మేకర్స్‌తో పని చేయడానికి సీనియర్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లతో సినిమాలు చేయడం వల్ల మార్కెట్ కూడా మూడింతలు పెరుగుతుంది అని భావిస్తున్నారు.
ఎందుకంటే, ఈ జనరేషన్ దర్శకులంతా ఇన్నోవేటివ్ ఐడియాస్‌తో ముందుకు పోతున్నారు. మేకింగ్, ప్రజెంటేషన్ నెక్ట్స్ లెవల్‌లో చూపిస్తున్నారు. దాంతో ఆ మేకింగ్‌కు ఫిదా అయిపోతున్నారు సీనియర్స్ హీరోలు. తాజాగా సైంధవ్ టీజర్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. మామూలుగా వెంకీ సినిమాపై ఉండే అంచనాల కంటే సైంధవ్‌పై డబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండటానికి కారణం డైరెక్టర్ శైలేష్ కొలను. సైంధవ్ మేకింగ్ కొత్తగా వుందని ఆమాత్రం సినిమా మీద అభిమానం వున్న ఎవరికైనా బోధపడుతుంది. ఇప్పటి వరకు వెంకటేష్‌ను ఏ దర్శకుడు చూపించని విధంగా ప్రజెంట్ చేసారు శైలేష్ కొలను. అందుకే దీనిపై అంచనాలు పెరిగిపోయాయి.
అదే విషయం బాలయ్య భగవంత్ కేసరి విషయంలోనూ వర్తిస్తుంది. మామూలుగా ఉండే మార్కెట్ కంటే దీనికి డబుల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి. దానికి అనిల్ రావిపూడి మార్క్ కారణం అని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పక్సీన పనిలేదు. అదేవిధంగా వీరసింహారెడ్డిలో బాలయ్యను చాలా పవర్ ఫుల్‌గా చూపించారు గోపీచంద్ మలినేని. అలాగే ఇప్పుడు అనిల్ సైతం నటసింహాన్ని నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో చూపించబోతున్నారు. ఇక తమిళంలో లోకేష్ కనరాజ్, నెల్సన్ లాంటి యంగ్ డైరెక్టర్స్ హవా కనిపిస్తుంది.