దివ్యాంగుడు చక్రాల కుర్చీలో వుండగా ఆటోగ్రాఫ్ ఇచ్చిన బన్నీ.. గ్రేట్ అని పొగడ్తలు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఇక్కడ చెబితే అతిశయోక్తిగా వుంటుంది. ఎందుకంటే బన్నికి తెలుగునాట ఎంత క్రేజ్ వుందో ఇతర ప్రాంతాల్లో కూడా అంతే క్రేజ్ వుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, నార్త్ లో సైతం బన్నీకి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని మనందరికీ తెలిసినదే. బన్నీ సినిమాలు భాషతో సంబంధం లేకుండా థియేటర్లలో, ఓటీటీలలో, యూట్యూబ్ లో సైతం సంచలనాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో బన్నీకి ఎవరూ సాటిరారనే సంగతి కూడా మనకు తెలుసు.

రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో సైతం స్టైలిష్ గా కనిపించడానికి ఇష్టపడే అల్లు అర్జున్ తాజాగా చేసిన ఒక పని ద్వారా అందరి మన్ననలు పొందారు. అవును, తాజాగా చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరకు వెళ్లి బన్నీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆ క్షణం తాను స్టార్ హీరో అయినప్పటికీ అభిమాని పేరు, ఇతర వివరాలను తెలుసుకుని మరీ అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం ముఖ్యంగా అల్లువారి అభిమానులకు చాలా ఖుషీ చేసింది. దాంతో బన్నీ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ తరుణంలో బన్నీ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదిగి నెక్స్ట్ లెవెల్ కు వెళ్తారని ఫ్యాన్స్ దీవెనలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఫాన్స్ గట్టిగా కోరుకుంటున్నది ఏమంటే, దర్శక ధీరుడు జక్కన్న బన్నీతో సినిమా చేస్తే చూసి తరించాలని ఆరాట పడుతున్నారు. బన్నీలా ఫ్యాన్స్ తో సరదాగా మాట్లాడే హీరోలు చాలా అరుదుగా ఉంటారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆ చిన్నారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీ భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు వేస్తున్నారు.