కీర్తి సురేష్ కి అలాంటి గిఫ్ట్ ఇచ్చిన వరుణ్.. యవ్వారం తేడాగా ఉందే..!!

వామ్మో .. ఏంటిది నిన్నకాక మొన్న ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిన వరుణ్ ధావన్ కు కీర్తి సురేష్ కు మధ్య అప్పుడే అంత నడిచిపోయిందా..? అంతవరకు వెళ్లిపోయారా..? షాకింగ్ ..నమ్మలేకపోతున్నాం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు.

ఈ క్రమంలోనే  సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్యాన్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు . అయితే రీసెంట్ గానే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కి తన కో పార్ట్నర్ వరుణ్ ధావన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏకంగా ఆమె కోసం ప్లాటినం నేమ్ ప్లేటెడ్ బ్రేస్లెట్ ను గిఫ్ట్ చేశారట .

కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఫ్రెండ్స్ కి సైతం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వలేకపోయాడు వరుణ్ . అయితే కీర్తి సురేష్ కి మాత్రం ఎందుకు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ప్రజెంట్ చేశాడు అన్న వార్త వైరల్ అవుతుంది. యవ్వారం చూస్తా ఉంటే ఏదో తేడా గానే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు జనాలు. ఇది ప్రేమనా..? దోమనా..? కొన్నాళ్లు ఆగితే తెలిసిపోతుంది..!!