జక్కన్న సినిమా కోసం మహేష్ మరీ అంత డిమాండ్ చేస్తున్నాడా?

యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని తీసుకుంటే ఇక్కడ టాప్ రెమ్యూనిరేషన్ అందుకునే హీరోలలో మహేష్ బాబు ముందు వరుసలో వుంటారు. తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలలోనూ చాలా ప్రత్యేకమైన క్రేజ్ వుంది. దానికి కారణం ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. అవును, మహేష్ బాబు వయస్సు నానాటికీ పెరుగుతుంది తప్ప ఆయన అందం మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన వయసు పెరుగుతున్న కొద్ది.. ఇంకా హ్యాండ్సమ్ గా మారిపోతూ ఉన్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక మహేష్ బాబు సినిమాలకు ఎటువంటి క్రేజ్ వుందో కూడా ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. అందుకే మహేష్ అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు క్యూలు కడుతూ వుంటారు. మరీ ముఖ్యంగా పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు సినిమాల తర్వాత మహేష్ డిమాండ్ మరింత పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళితో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అధికారికంగా ప్రారంభం కాబోతోంది.

ఇకపోతే రాజమౌళి సినిమాలు అంటే భారీ బడ్జెట్ ఉండడం చాలా కామన్. ఈ నేపధ్యంలోనే మహేష్ సినిమా కోసం కూడా ఇలాంటి భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతకు మునుపు తీసుకోనంత భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్నారు గుసగుసలు వినబడుతున్నాయి. ఏకంగా 110 కోట్ల రూపాయలు అందుకోనున్నాడు అన్న వార్త ఇండస్ట్రీని ఊపేస్తోంది. అయితే టాలీవుడ్ హీరోలు తీసుకునే పారితోషకంతో పోల్చి చూస్తే ఇది నిజంగా భారీ మొత్తమే అని చెప్పాలి. కాగా ఈ విషయం తెలిసిన కొందరు ఒక్క మహేశ్ బాబే ఈ స్థాయిలో తీసుకుంటే, మరి జక్కన్న ఎంత తీసుకుంటాడో అని లెక్కలు వేసుకుంటున్నారు.