రష్మికపై అలాంటి కామెంట్స్ చేసిన సమంత..!!

ఈ మధ్యనే సౌత్ ఇండియన్ హీరోయిన్స్ సైతం ఎక్కువగా బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తూ ఘాటైన రొమాన్స్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు నటించడానికి ఏమాత్రం ఇష్టం చూపని తమన్నా కూడా రీసెంట్ గా వెబ్ సిరీస్లలో బెడ్ సన్నివేశాలలో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ విడుదల అవ్వగా ఈమెకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేవి ఇప్పుడు ఆ తర్వాత రష్మిక కూడా అదే ముద్ర వేసుకుంటోంది.

రష్మిక ఇటీవలే ఎనిమల్ అనే సినిమాతో బాలీవుడ్లో నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ నుంచి మొదటి పాట కూడా రీసెంట్గా విడుదల కావడం జరిగింది. రష్మిక ,రణబీర్ లిప్ కిస్ సన్నివేశాలు సెన్సేషనల్ గా మారాయి.. ఏదో ఒకచోట అంటే పర్లేదు కానీ పాట మొత్తం లిప్ లాక్ తప్ప మరొకటి లేదు అన్నట్లుగా కనిపిస్తోంది. పాటలోనే ఇలా ఉంటే ఇక సినిమాలు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు అంటే పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ పాత్ర మొదట రష్మిక కి కాదు సమంతకి వచ్చిందట.. సినిమా స్టోరీ బాగానే నచ్చిన ఇలా అడుగడుగునా రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం అంటే తన వల్ల కాదని.. మిగతా హీరోయిన్స్ లాగా చేయలేను అంటూ డైరెక్టర్ కి చెప్పేసిందట ..దేవరకొండ సలహా మేరకే రష్మి కాని తన సినిమాలో హీరోయిన్గా తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఫ్యామిలీ మెన్ సీజన్-2 లో సమంత తన విలనిజంతో ఆకట్టుకున్న అందులో ఉండే రొమాన్స్ విషయాలలో ఇబ్బంది పడింది. అందుకే ఇలాంటి రొమాంటిక్ విషయాలలో మళ్ళీ నటించకూడదని రిజెక్ట్ చేసిందట సమంత.