ఇంట్లో నుంచి ఈగలను తరిమేయాలంటే ఈ చిట్కా పాటించండి..!!

సాధారణంగా చాలామంది ఇళ్లల్లో ఈగలు ముసరడం వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి ..ఏదైనా తీపి పదార్థం కానీ మరే ఇతర పదార్ధం కానీ ఉన్నాయి అంటే కచ్చితంగా ఈగలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.. దీంతో ఇంటిని మొత్తం చెత్తాచెదారం లేకుండా చాలా క్లీన్ చేసిన అవి కనిపిస్తూనే ఉంటాయి. వీటి వల్ల ఎన్నోసార్లు చాలామంది చిరాకుపడ్డ సందర్భాలు ఉంటాయి.. ముఖ్యంగా మనం తినే ఆహార పదార్థాల పైన కూడా ఎక్కువగా వాలుతూ ఉంటాయి దీని వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్లు వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయట.

ఇక ఈగలు ఒకచోట ఉన్న బ్యాక్టీరియాని మరొక చోటికి తీసుకొని వచ్చేలా చేస్తూ ఉంటాయి.. ఇలా ఇబ్బంది పడేవారు ఈగల్ని ఇంట్లో నుంచి తరిమికొట్టాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

1). ఈగలు ఎక్కువగా ఉన్నచోట కర్పూరం వెలిగించడం చేయాలి దీంతో ఈగలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కర్పూరంలో ఉండేటువంటి ఘాటైన వాసన వల్ల ఈగలు దూరంగా వెళ్లిపోతాయి.

2). యాపిల్ సైడర్ వెనిగర్ లో ఘాటు వాసనలు ఉంటాయి ఇది ఆరోగ్యం కోసమే కాకుండా ఇలా చిట్కాగా కూడా దోమలు తరిమేందుకు ఉపయోగించుకోవచ్చు.

3). తులసి ఆకులను ఆరోగ్యపరంగా , ఆధ్యాత్మికంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు అయితే తులసి మొక్కతో దోమల బెడదనే కాకుండా ఈగల బెడద నుంచి కూడా మనం బయటపడవచ్చు.

4). దాల్చిన చెక్కలో ఉండే ఘాటు వాసన వల్ల ఈగలు ఎక్కువగా ఉన్న ఈ పొడిని చల్లితే అక్కడ నుంచి ఈగలు వెళ్లిపోతాయి. దీంతో ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయట.