నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి తర్వాత మరో హిట్ ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలె ఆయన `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దసరా పండుగ కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరికి ఆడియెన్స్ ను పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. సినిమా బాగుందంటూ మెజారిటీ పీపుల్ రివ్యూలు ఇచ్చారు. టాక్ అనుకూలంగా ఉండటంతో బాలయ్య బాక్సాఫీస్ ను దున్నేస్తున్నారు. అద్భుతమైన వసూళ్లను కొట్టగొడుతున్నారు. తాజాగా భగవంత్ కేసరి ఐదు రోజుల కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది.
రూ. 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఐదు రోజుల రన్ పూర్తి అయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 33.50 కోట్ల షేర్, రూ. 56.35 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 42.40 కోట్ల షేర్, రూ. 75.10కోట్ల వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఈ సినిమాకు రూ. 26.10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఐదో రోజు కూడా భగవంత్ కేసిరి 5 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇదే జోరు కొనసాగిస్తే బాలయ్యకు హ్యాట్రిక్ ఖాయమవుతుంది. కాగా, ఏరియాల వారీగా భగవంత్ కేసరి 5 డేస్ టోటల్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం: 10.95 కోట్లు
సీడెడ్: 8.15 కోట్లు
ఉత్తరాంద్ర: 2.99 కోట్లు
తూర్పు: 2.01 కోట్లు
పశ్చిమ: 1.79 కోట్లు
గుంటూరు: 4.19 కోట్లు
కృష్ణ: 1.89 కోట్లు
నెల్లూరు: 1.53 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ= 33.50 కోట్లు(56.35 కోట్లు~ గ్రాస్)
———————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 3.05 కోట్లు
ఓవర్సీస్: 5.85 కోట్లు
———————-
వరల్డ్ వైడ్ కలెక్షన్= 42.40 కోట్లు(75.10 కోట్లు~ గ్రాస్)
———————-