అలాంటి విషయాలను కేవలం నా భర్తతో మాత్రమే మాట్లాడతా.. దీపికా కామెంట్స్ వైరల్.. ?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో ఒకరైన దీపిక పదుకొనే వయసు పెరుగుతున్న కొద్దీ అందం మరింతగా పెంచేస్తుంది. గ్లామర్ తో ఆక‌ట్టుకుంటూ వ‌రుస అవకాశాలను అందుకుంటూ నటన పరంగా బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మూవీ షూట్‌లో బిజీగా ఉంది దీపిక. ఈ సినిమాపై ప్రేక్షకులు అంతకంతకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ పొదుపు, మదుపు విషయం నాకు ఖచ్చితమైన అభిప్రాయాలను ఉన్నాయని వ్యవహరించింది.

నా బ్యాంక్ అకౌంట్ లోని ప్రతి రూపాయి నా సొంత కష్టార్జితం అని దీపికా వివరించింది. ఆ డబ్బును చెమటలు చిందించి పొందాలని ఆ డబ్బులను పాపాయిగా పెంచాలని ఆరాటపడుతోందని దీపికా పదుకొనే వివరించింది. నాలా ఆలోచించే వారెవరైనా తారసపడితే స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టడానికి నేను రెడీ అంటూ కామెంట్ చేసింది. దేశి కంపెనీల పైనే ఇప్పటివరకు నేను పెట్టుబడులు పెట్టానని వివరించిన దీపికా నేను యాక్టర్ కావచ్చు కానీ జన్మతః క్రీడాకారినని వివరించింది. లైఫ్ నేను ఆటలా భావిస్తున్నానని ప్రపంచ మైదానంలో నా జీవితాన్ని చూస్తానని దీపిక పేర్కొంది.

సినిమా విజ‌యాని సాధించిన ప్రతిసారి కప్పు గెలుచుకున్న ఆనందం.. ఫ్లాప్ అయినా కూడా హుందాగానే స్వీకరిస్తా అంటూ వివరించింది. నాకంటే కూడా నటించే వాళ్ళు ఉండవచ్చు అయితే క్రమశిక్షణ విషయంలో మాత్రం నా తర్వాతే ఎవరైనా అంటూ దీపిక కామెంట్ చేసింది. ఇక నా భర్త ఇంకెవరితోనూ సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకోవాలని ఆమె వివరించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మనసు విప్పి మాట్లాడే అంత చనువు భర్త దగ్గర మాత్రమే ఉందని వివరించిన దీపిక తనకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్ ఇంట‌ ట్రెండ్ అవుతుంది.