నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల, శరత్ బాబు, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది.
టాక్ అనుకూలంగా ఉండటం, దసరా హాలిడేస్ కలిసి రావడంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద భగవంత్ కేసరి బాగానే వసూళ్లు రాబడుతోంది. ఇకపోతే బాలయ్య, కాజల్ జంటగా నటించిన తొలి సినిమా ఇది. పైగా బిడ్డ పుట్టిన తర్వాత తెలుగులో కాజల్ కు రీఎంట్రీ మూవీ కూడా భగవంత్ కేసరే. తెరపై కాజల్ కనిపించేది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో ఆమె బాగానే ఆకట్టుకుంది. రీఎంట్రీతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. భగవంత్ కేసరికి ఫస్ట్ ఛాయిస్ కాజల్ కాదు.
ఆమె కంటా ముందు ఇద్దరు హీరోయిన్లు బాలయ్య మూవీని రిజెక్ట్ చేశారు. ఆ అన్ లక్కీ హీరోయిన్స్ మరెవరో కాదు.. లేడీ సూపర్ స్టార్ నయనతార, త్రిష. మొదట అనిల్ రావిపూడి నయనతారను సంప్రదించగా.. ఆమె తెలుగులో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత పొన్నియిన్ సెల్వన్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన త్రిషను హీరోయిన్ గా అడిగారట. కానీ, త్రిష అప్పటికే దళపతి విజయ్ తో `లియో`, అజిత్ తో ఓ మూవీకి కమిట్ అయింది. పలు లేడీ ఓరియెంటెడ్ కథలు కూడా చేతిలో ఉన్నాయి. దాంతో డేట్స్ ఖాళీగా లేక త్రిష కూడా నో చెప్పింది. ఇక వీరిద్దరూ రిజెక్ట్ చేసిన తర్వాత భగవంత్ కేసరి మూవీ ఆఫర్ కాజల్ ను వరించిందని అంటున్నారు.