‘ హాయ్ నాన్న ‘ మూవీ ఐటమ్ సాంగ్.. అ స్టార్ హీరోయిన్..?

నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మూవీ హాయ్ నాన్న. గ‌త ఏడాది దసరా అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక త్వరలోనే నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఫాదర్ సెంటిమెంట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా బేబీ కియారా ప్రధాన పాత్రలు నటిస్తున్నారు.

సౌర్యవ్‌ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీలో ఐటెం సాంగ్ పెట్టే ఉద్దేశంలో మూవీ టీమ్ ఉన్నారట. అందులో భాగంగా ఈ సాంగ్‌కు ఓ పవర్ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ తీసుకుంటే సినిమా ప్రేక్షకుల్లో మరింత కనెక్ట్ అవుతుందని డిసైడ్ అయినట్లు సమాచారం.

దాని కోసం మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతిహాసన్‌ను సెలెక్ట్ చేసుకోవాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ స్పెషల్ సాంగ్ కోసం శృతిహాసన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్న ప్రేక్షకులంతా ఇక శృతిహాసన్‌తో ఐటమ్ సాంగ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.