మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కూతురుకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగానే రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ బాలికా నిలయం సేవా సమాజ్‌లోని అమ్మాయిలతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. రామ్ చరణ్, ఉపాసన, వీరి కూతురు క్లిన్ కారా, చిరంజీవి దంపతులు, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లు, ఆయన తల్లి అంజనా దేవి తదితరులు దసరా, బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాసన తన కూతురు క్లిన్ కారాతో కలిసి బతుకమ్మ కూడా ఆడింది. అలాగే అక్కడికి వచ్చిన మహిళలందరికీ చిరంజీవి తల్లి అంజనాదేవి చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మరి లేటెందుకు ఆ వీడియోపై మీరు ఓ లుక్కేసేయండి.
View this post on Instagram