మహేష్ ‘ గుంటూరు కారం ‘ ఆ తెలుగు మూవీకి కాపీనా..?

ప్రస్తుతం సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నటించిన మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న. ఇక తాజాగా ఈ సినిమా ఓ టాలీవుడ్ సినిమాకు కాపీ అనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు మంచి కాన్సెప్ట్‌తో రిలీజ్ అయిన సినిమాలనే మళ్లీ ఈ జనరేషన్ కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్లు సినిమాలు తీస్తున్నారు. దాంతో మంచి సక్సెస్ కూడా అందుకుంటున్నారు.

అందులో ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫస్ట్ లిస్టులో ఉన్నాడు. ఎందుకంటే నితిన్ తో ఈయన చేసిన అఆ, అల్లు అర్జున్‌తో చేసిన అలవైకుంఠపురంలో సినిమాలు రెండు కూడా తెలుగులో ఓల్డ్ సినిమా ఫ్లాట్ పాయింట్ తీసుకుని తెరకెక్కించినవే. ముఖ్యంగా కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా వచ్చిన మీనా సినిమాని అఆ సినిమా పేరుతో రూపొందించాడు. అప్పట్లో వచ్చిన ఇంటిగుట్టు అనే సినిమాని అలవైకుంఠపురం సినిమాగా తెరకెక్కించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా కాపీ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

దీంతో త్రివిక్రమ్‌కు గురూజీ అనే పేరు అవసరమా అంటూ చాలామంది నెట్టిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం గుంటూరు కారం సినిమా కూడా కృష్ణ హీరోగా వచ్చిన ఓల్డ్ మూవీకి కాపీగా తెర‌కెక్కుతుందంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. ఇలాంటి క్రమంలో కాఫీ సినిమాలు చేసే ఓ కాఫీ క్యాట్ కి గురూజీ అనే టాగ్ ఎందుకు తగిలించారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తో గతంలో తరికెక్కించిన అజ్ఞాతవాసి సినిమా కూడా ఓ స్పెయిన్ మూవీకి కాపీయట. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు పొందాడు.