సలార్ మూవీ డైలాగ్ లీక్.. సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుందంటూ..?!

ప్రభాస్ హీరోగా సలార్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే అంచనాలు పెరిగిపోతున్నాయి. మూవీ ఫ్రీ ఫోన్ కానుంది అని డిసెంబర్ 20వ తేదీన సలార్ మూవీ బాక్సాఫీస్ బారిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని న్యూస్ వైరల్ అవుతుంది. ఇక నిన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రాగా.. ఈ అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ పోస్ట్ చేస్తూ యుద్ధానికి నువ్వు నీ ఆయుధాలను తీసుకొచ్చుకో.. నేను ఇతన్ని తీసుకొస్తున్న అంటూ ఓ డైలాగులు ట్యాగ్ చేశారు. ఇది సలార్‌ సినిమాలోది అని అర్థమవుతుంది. ఈ డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాతో కచ్చితంగా ప్రభాస్ మరింత పవర్ఫుల్ గా కనిపించబోతున్నారని డైలాగ్ ద్వారా క్లియర్ అయిపోయింది. ఇక సినిమాలో ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికులకు హెడ్‌గా కనిపించబోతున్నాడ‌ట.

ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో ప్రపంచం లోకి తీసుకువెళ్లబోతున్నారని సమాచారం. జగపతిబాబు ఈ సినిమాలో కీలక పాత్రలు నటించనున్నారు. కే జి ఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో సల్లర్ సినిమా ప్రమోషన్స్ కూడా భారీ లెవెల్ లో జరగనున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుంది. ఇక ఈ రెండు పార్ట్‌ల మూవీ షూటింగ్‌స్‌ ఎప్పటికీ పూర్తి అవుతాయో క్లారిటీ లేదు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.