అభిమానులకు చరణ్ మరో గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ డే నాడే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకర డైరెక్షన్‌లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా లేకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మూవీ టీం పై ఫైర్ అవుతున్నారు. ప్రతిరోజు దిల్ రాజును ట్యాగ్ చేసి వీడియో సాంగ్ గురించి ఆసక్తిగా అడుగుతున్నారు. ఒకానొక టైం లో కోపంతో బండ బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. రామ్‌చరణ్ పుట్టిన రోజున ఒక స్పెషల్ పోస్టర్ వదిలారు. ఆ తర్వాత ఒక కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ రాలేదు. మధ్యలో మొదటి పాట కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ పాట అధికారికంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు కూడా వాళ్లు రివిల్ చేయలేదు. ఇలా అభిమానులకు అప్డేట్స్ ఇవ్వకుండా జరుపుకుంటూ వస్తున్న మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ఇచ్చారు. సోషల్ మీడియాలో లీక్ అయినా జరగండి ఊర మాస్ లిరికల్ పాటని ఈ దివాళి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

ఈ పాటకి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేయగా శంకర్ మార్క్‌ స్పష్టంగా కనిపించింది. పాట మాత్రం శంకర్ స్టైల్ లో కాకుండా మెగా రెగ్యులర్ మాస్ మూవీ సినిమాల్లో లాగా ఉంటుందని భావించారు.. కానీ ఇక్కడ దానికి పూర్తిగా ఆపోజిట్ గా ఉండడంతో ఈ సాంగ్ పై నెగిటివిటీ ఏర్పడింది. కానీ అది కేవలం ప్రాక్టీస్ సాంగ్ మాత్రమే ఒరిజినల్ సాంగ్ విన్న తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోతాయి అంటున్నారు. శంకర్ సినిమాలో సాంగ్ షూటింగ్ నార్మల్ సినిమాల కంటే మించి ఉంటుంది.

ఇది శంకర్ మార్క్ సాంగ్స్ అని చూస్తేనే అర్థమయిపోయే రేంజ్ లో ఆ పాటలు ఉంటాయి. ఇక రిలీజ్ తర్వాత ఈ సాంగ్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో వేసి చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్.. వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో సంద‌డి చేస్తున్నాడు. అక్కడ నుండి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత నాన్ స్టాప్ షెడ్యూల్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. మార్చిలోపు షూటింగ్ పూర్తి చేసి నెక్స్ట్ దసరా కల్లా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.