మాజీ ల‌వ‌ర్ పై వ‌రుణ్ తేజ్ రివేంజ్‌.. హీరోయిన్ ఇంటికెళ్లి మ‌రీ అలాంటి ప‌ని చేశాడా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తన బ్యాచిట‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌ ఏడడుగులు వేయబోతున్నాడు. గత కొద్దిరోజుల నుంచి లవ్ లో ఉన్న ఈ జంట వచ్చే నెల ఒకటో తేదీన ఇటలీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, బ్యాచిలర్ పార్టీలు అంటూ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వచ్చింది. త్వరలో ఓ ఇంటివాడు కానున్న నేపథ్యంలో వరుణ్ తేజ్‌ తన మాజీ లవర్ పై రివేంజ్ తీర్చుకుంటున్నాడట. గతంలో వరుణ్ తేజ్ ప్ర‌ముఖ హీరోయిన్‌ రాశి ఖ‌న్నాతో ప్రేమలో ప‌డ్డాడ‌నే టాక్ ఉంది. అయితే వీరిద్దరు కొన్నాళ్ల డేటింగ్ తర్వాత విడిపోయారు.

ఇక‌ ఇప్పుడు లావ‌ణ్య‌ను ల‌వ్ మ్యారేజ్ చేసుకోబోతున్న వ‌రుణ్‌.. రీసెంట్ గా రాశి ఖ‌న్నా ఇంటికి వెళ్లి మరి తన వెడ్డింగ్ కార్డ్ ను ఇచ్చాడట. నిజానికి పెళ్లి ఇటలీలో కావడంతో సినిమా పరిశ్రమకు చెందిన‌వారిని ఆహ్వానించడం లేదు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వరుణ్ లావణ్య పెళ్లిలో సందడి చేయనున్నారు. ఈ నేప‌ధ్యంలోనే ఇట‌లీ ప్ర‌యాణానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి త‌రుణంలో వ‌రుణ్ కావాల‌ని రాశి ఖ‌న్నాకు వెడ్డింగ్ కార్డు ఇచ్చాడట. ఆమె కుల్లుకునేలా చేయాల‌ని పెళ్లికి రమ్మని మరీ మరీ చెప్పాడట. దాంతో రాశి కాస్త నొచ్చుకుంద‌ని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.