మొబైల్ చూస్తూ భోజనం చేస్తున్నారా ఎంత ప్రమాదమో తెలుసా..?

మొబైల్ అనే ది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా బానిసత్వంగా మారుతూ ఉన్నారు. మొబైల్ లేనిది ఎక్కడికి ప్రయాణించలేము అనే అంతగా అడాప్ట్ అయిపోయారు.. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా మొబైల్ ని చూస్తూ భోజనం తినేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇలా తినడం ఎంత ప్రమాదమో తాజాగా కొంతమంది నిపుణులు పరిశోధనలు చేసి తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

చాలామంది మొబైల్ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. దీంతో తినే వాటికంటే అధికం మోతాదుని మించి తినడం జరుగుతుందని కొంతమంది పరిశోధకులు కొంతమందిని తీసుకొని మరి పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ అలవాటు వల్ల బరువు పెరగడానికి ముఖ్య కారణం అవుతుందట. అయితే భోజనం చేసేటప్పుడు ఏకాగ్రత మొత్తం మనం తీసుకునే ఆహారం మీదే ఉండాలని లేకపోతే అతిగా తినే ప్రమాదం వల్ల పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా మొబైల్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుపుతున్నారు. మొబైల్ చూసుకోకుండా ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమ్ముతూ తినడం వల్ల పలు పోషకాలు శరీరానికి బాగా ఒంటి పడతాయట. ఇలా చేయడం వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తినకుండా ఉంటారట దీనివల్ల బరువు తగ్గించుకోవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

మొబైల్ ని ఎక్కువ సేపు చూడడం వల్ల కళ్లకు కూడా చాలా ఇబ్బందులు వస్తాయట. దీనివల్ల నిద్రలేని రాత్రులు కూడా గడపవలసి ఉంటుంది అందుకే అవసరం లేనప్పుడు మొబైల్ ని సైతం పక్కన కి వేసి మన పనులు చేసుకోవడం చాలా మంచిది.