మీ పిల్లలు టూత్ పేస్ట్ తింటున్నారా.. అయితే ప్రమాదమే..?

చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దంతాలను శుభ్రం చేయడానికి ఎక్కువగా టూత్ పేస్టులను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇలా పేస్టులను ఉపయోగించడం అనేది చాలా ప్రమాదమట.. టూత్ పేస్ట్ కడుపులోకి వెళ్లి అస్తిపంజరం ఫ్లోరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధికి కారణంగా మారుతోందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. ఆ తర్వాత ఎముకలు బలహీనంగా మారుతాయట. దంతాలు కూడా చాలా దెబ్బతింటాయని వైద్యులు సైతం తెలియజేస్తున్నారు.

When Can My Child Start Using Regular Toothpaste? | Rother Dental Blog

టూత్ పేస్టును చిన్నపిల్లలు మింగకుండా చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే టూత్ పేస్ట్ లో ఉండే ఫ్లోరైడ్ వల్ల క్లోరోసిస్ అనే వ్యాధి వస్తుందట. సాధారణంగా ఈ వ్యాధి అధిక ఫ్లోరైడ్ ఉన్న నీరు తాగడం వల్ల కూడా ఎక్కువగా సంభవిస్తుంది.. కొన్ని సందర్భాలలో టూత్ పేస్ట్ కారణంగా కూడా ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. 6 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే అనేక రకాల వ్యాధులకు సైతం దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వైద్యులు తెలుపుతున్న ప్రకారం దంతాలను శుభ్రం చేయాలి అంటే బటాని గింజంత పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఫ్లోరిసిస్ అనేది రెండు రకాలుగా వస్తుంది.. ఒకటి డెంటల్ ఫ్లోరోసిస్ ఇది ప్రధానంగా పిల్లలపైన ప్రభావం చూపుతుందట. ముఖ్యంగా పిల్లల దంతాలు కూడా పసుపు రంగులో మారడం ప్రారంభిస్తాయి రెండవది అస్తిపంజరం ఫ్లోరోసిస్ ఇది కీళ్లపైన చాలా ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత మోకాళ్లు భుజాలు వీపు వంటివి బలహీనంగా మార్చేలా చేస్తుంది.

అందుకే చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ ని ఉపయోగించడం మంచిది.. ముఖ్యంగా పేస్ట్ మింగకుండా చూసుకోవాలి.