స్కంద, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీల్లో ఆ కామన్ పాయింట్ ఏంటో తెలుసా..?

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన మూవీ స్కంద. ఇటీవల రిలీజైన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న తరువాత సినిమాలో అసలు లాజిక్ లేకుండా ఫైట్ సీన్స్ ఉన్నాయంటూ ట్రోల్స్ కు గురైంది. ఇక‌ ఈ సినిమాలో ప్రతి పాయింట్ను వెతికి మరీ ట్రోల్స్ చేస్తున్నారు మీమర్స్‌. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, స్కంద మూవీ లో ఉన్న కామెంట్ పాయింట్ గుర్తుపట్టారా.. అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు.

స్కంద మాస్ ఎంటర్టైనర్ మూవీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు క్లాసికల్ మూవీ అయితే ఈ రెండు సినిమాల మధ్యన కామన్ పాయింట్ ఉంద‌ట.. అది ఏంటో ఓ సారి చూద్దాం. ఈ రెండు సినిమాల మధ్యన ఉన్న కామన్ పాయింట్‌ను కొత్తిమీర కట్ట అనే ఓ సిల్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనిపెట్టేసింది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకటేష్, మహేష్ బాబు లకు పేరు ఉండవు. పెద్దోడు, చిన్నోడు అంటూ పిలుస్తూ ఉంటారు. అదే విధంగా స్కంద సినిమాలో రామ్, శ్రీలీలకి కూడా పేర్లు ఉండవు సీఎం అల్లుడు, సీఎం కూతురు అని ప్రస్తావిస్తూ ఉంటారు. ఎక్కడ వీరి పేర్లు పిలవరు.

దీంతో ఈ నలుగురి పేర్లు ఎవరైనా చెప్పండయ్యా అంటూ ఆ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వారు సదరు గ్రూప్ మెంబర్స్ కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ రెండు సినిమాలను ట్యాగ్ చేస్తూ తెగ ట్రోల్స్‌ చేస్తున్నారు. బోయపాటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలా చేశారా.. లేదా.. ఇదొక యాదృచ్ఛికమ్మ తెలియాలి. ఇక‌ ఈ పోస్ట్ సోషల్ మీడియా వైరల్ అవ్వడంతో నెటిజ‌న్స్ అంతా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.