టైర్ -2 హీరోలో అత్యధికంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న నాని..!!

నాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టైర్-2 హీరోలలో ఒకరిగా నిలిచారు. ఈ ఏడాది దసరా సినిమాతో పాన్ ఇండియా లెవల్లో తన క్రేజీను అందుకున్నారు నాని. ప్రస్తుతం హాయ్ నాన్న అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం. నాచురల్ స్టార్ నాని రెమ్యూనరేషన్ విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. దాదాపుగా ఒక్కో సినిమాకి 25 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

The most charming and Natural actor - Nani!

ముఖ్యంగా నాన్ థియేటర్ హక్కులు మార్కెట్ పరంగా పెరగడంతో నాని ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాయ్ నాన్న సినిమా కోసం దాదాపుగా 22 కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం.అలాగే వివేక్ ఆత్రేయ డివివి దానయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం 25 కోట్లు అడుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాని నటిస్తున్న సినిమాలన్నీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నట్లు సమాచారం.

టైర్ -2 హీరోలలో ఇలా అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా కూడా పేరు సంపాదిస్తున్నారు నాని.. సీనియర్ హీరోలో బాలకృష్ణ కూడా ప్రస్తుతం 20 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండగా నాని మాత్రం 25 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.నాని సక్సెస్ రేట్ కూడా ప్రస్తుతం ఎక్కువగానే ఉందంటూ అభిమానులు భావిస్తున్నారు. అందుకే అంతటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది.