స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా చూస్తున్నారా.. అయితే ఈ జబ్బు వచ్చినట్టే..?

స్మార్ట్ ఫోన్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవిత కాలంలో ఒక భాగం అయింది.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు వీటిని చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్దలే కాకుండా చిన్న పిల్లలు కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ లకు బాగా అడాప్ట్ అయిపోయారు. మొబైల్ లేనిదే అన్నం కూడా తినలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా కొంతమంది నిపుణులు సైతం స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చాలా ముప్పు ఏర్పడుతోందని తెలియజేస్తున్నారు. స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించేవారు విజన్ సిండ్రోమ్ అనే జబ్బుకు గురవుతున్నారట. ఈ జబ్బు వల్ల కలిగే పరిణామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Students excessively using phones experience isolation, depression and  anxiety-Tech News , Firstpost

ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ని ఉపయోగించినట్టు అయితే కంటికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయట. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదవ ఎక్కువవుతుందట.. కంటిమీద పెరిగేటువంటి ఒత్తిడి వల్ల స్మార్ట్ మొబైల్ విజన్ సిండ్రోమ్ సమస్యకు దారితీస్తుందట. దీనివల్ల కంటి చూపు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట. అధికంగా స్మార్ట్ మొబైల్ కంప్యూటర్ ని ఉపయోగించేవారు ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలియజేస్తున్నారు.మరి ముఖ్యంగా చిన్న పిల్లల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి వీరికి స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా వాడితే చిన్నతనంలోనే చూపుకు సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అందుచేతనే పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..

1).ముఖ్యంగా మొదట మొబైల్ లో టెక్స్ట్ సైజ్ అక్షరాలు కాస్త పెద్దవిగా పెట్టుకోవడం మంచిది.

2).బ్రైట్నెస్ కూడా ఆటోమేటిక్ ఆప్షన్ ను సెట్ చేసుకోవడం చాలా మంచిది.. దీనివల్ల కళ్లకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు.

3).మొబైల్ కానీ టీవీ కానీ చూసేటప్పుడు 18 అంగుళాల దూరంలో ఉంచాలి.

4). ప్రతి ఒక్కరి మొబైల్ లో నైట్ మోడ్ అనే ఫీచర్ ఉంటుంది దీన్ని కచ్చితంగా ఆన్ చేసుకోవడం వల్ల కళ్ళ పైన ఎలాంటి ప్రభావం చూపదు. అవసరంలేని సమయంలో వీటిని పక్కకి పడేయడం మంచిది.