షాప్ ఓపెనింగ్ రోజు సితార బుగ్గ గిల్లిన వ్యక్తి.. సితార రియాక్షన్ ఇదే (వీడియో)

ఘట్టమనేని వారసురాలు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిన్న వయసు నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారి.. బ్రాండ్ అంబాసిడర్ గా వ్య‌వ‌హరిస్తుంది.

ఇటు చిన్న వయసులోనే తండ్రి అడుగుజాడల్లో గ్లామర్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటు తండ్రి బాటలోనే సేవా కార్యక్రమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన తల్లి నమ్రతతో కలిసి హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని నెక్సస్ మాల్ లో ఏర్పాటుచేసిన బొమ్మల కొలువు ప్రారంభించడానికి వెళ్ళింది.

ఇక సితార అక్కడకు రావడంతో ఆమెతో ఫోటోలు దిగేందుకు చాలామంది ఎగబడ్డారు. ఈ క్రమంలోని ఓ భామ సితార బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకుంది. దీనికి సితార నవ్వుతూ ఆమె మొఖం చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.