ఆ ఏరియాలో విజయ్ ‘ లియో ‘ కి సెన్సేషనల్ బుకింగ్స్..

దళపతి విజయ్ కోలీవుడ్ హీరోగా మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. విజయ్ దళపతికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విజయ్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ‌రాజన్‌ తర్కెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ లియో ‘. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నాయి సినిమా అక్టోబర్ 19 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కంటే ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైట్ తో రిలీజ్ కాబోతున్న‌ ఈ సినిమా ఇప్పటికే సరికొత్త రికార్డులను సృష్టించినట్టు సోషల్ మీడియాలో న్సూస్ వైరల్ అవుతుంది.

అయితే ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రమోషనల్ ఈవెంట్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టైటిల్, ప్రోమో, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ ఈ మూవీ బుకింగ్స్ అప్పుడే రికార్డులను సృష్టిస్తున్నాయి. బుకింగ్స్ లోనే యుఎస్ లో అప్పుడే 2 లక్షల డాలర్స్ కి పైగా గ్రాస్ వ‌శుళ‌ను క్రాస్ చేసినట్లు సమాచారం.

యూకేలో ఏకంగా 32,500 కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. మొత్తానికి ఓవర్‌సిస్ మార్కెట్లో ఈ సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో కొత్త రికార్డులను సృష్టించింది. అంచనాలను మరింతగా పెంచేలా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ ఎటువంటి టాక్ మీ సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.