పైసా ఖర్చు లేకుండా దొరికే ఈ ఆకులతో ఇన్ని ఉపయోగాలా..?

మన చుట్టుపక్కల దొరికేటువంటి కొన్ని మొక్కలలో వేప చెట్టు కూడా ఒకటి.. దీనిని ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి..ఎవరు ఈ చెట్టుని తుంచి వేయకూడదు. ఎందుకంటే ఈ వేప చెట్టు అనేది ఒక దివ్యమైన ఔషధం వంటిది. ఇందులోని గింజలు, పువ్వులు, పుల్లలు కూడా అన్ని ఔషధాలుగానే ఉపయోగపడతాయి. ఈ వేప చెట్టు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట. ఈ రోజుల్లో చాలామంది సైతం బ్యూటీ ప్రాడక్టులలో వేప ఖచ్చితంగా ఉపయోగిస్తూ ఉన్నారు.

చర్మానికి వేప ఆకు చాలా మంచిది.. ఇందులో ఉండే విటమిన్ -C వల్ల నల్ల మచ్చలు మొటిమలు, పొడిబార చర్మం వంటి వాటిని తొలగిస్తాయి. వేపతో తయారుచేసిన సబ్బుతో స్నానం చేయడం వల్ల చాలా యవ్వనంగా కనిపిస్తారు.

ఆయిల్ స్కిన్ కలిగిన వారు వేప ఆయిల్ ని పట్టించుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

మృత కణాలని తొలగించే శక్తి కూడా వేపాకులకు ఉంటుంది. అందుకే వేపాకు పేస్టు తో స్నానం చేస్తే చర్మం మెరవడమే కాకుండా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. చర్మం మీద వచ్చే పలు రకాల వ్యాధులను కూడా దూరం చేస్తుంది.

చుండ్రు సమస్యతో ఎవరైనా ఇబ్బంది పడిన దురద వంటివి వస్తున్న వేపాకు పొడి తో స్నానం చేయడం వల్ల ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టవచ్చు.

జుట్టు ఎలాంటి దుమ్ము ధూళి బారిన పడకుండా ఉండడానికి వేప తైలం చాలా ఉపయోగపడుతుంది. జుట్టు పెరగాలి అన్న ఇందులో అవసరమైన విటమిన్-E ఖచ్చితంగా ఉంటుందట.

వేప నూనె లోకి కాస్త రోజు వాటర్ గంధం, పొడిని కలుపుకొని చర్మానికి రాసుకున్నట్లు అయితే అందంగా కనిపిస్తారట.