సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్.. షారుక్ తో ఢీకొట్టనున్న ప్రభాస్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందిన మూవీ సలార్. ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్ కొంతకాలం సినిమాను వాయిదా వేసి ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఇక తాజాగా డార్లింగ్ ఫాన్స్ కు ట్రీట్ ఇస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.

ఇక పార్ట్‌1 వరకు సిజ్‌ ఫైర్ అని టైటిల్ పెట్టారు. అయితే ఈ మూవీ క్రిస్మస్ కానుక డిసెంబర్ 22న రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై బాలీవుడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన సలార్ ఎగ్జిబిటర్ల మెయిల్స్ కూడా వెళ్లాయని ఆయన వివరించాడు. సలార్ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని ఆయన తన ట్విట్ లో చెప్పుకొచ్చాడు.

ఈ విషయంపై హంబాలుఫిల్మిస్‌ అధికారిక ప్రకటన చేస్తుందని కూడా ఆయన రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా షారుక్ వర్సెస్ ప్రభాస్ తప్పేలా లేదని వివరించిన ఆయన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన డుంకి సినిమా కూడా అదే రోజున విడుదల కానుంది అని దీంతో సలార్ వర్సెస్ డుంకీ ఉంటుందని తరుణ్ తన ట్విట్ లో వివరించాడు. ఒకవేళ సలార్ రిలీజ్ అయితే డుంకి కూడా అదే రోజున రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది.