ఈ తెగలో అన్ని వింత ఆచారాలే.. జీవితంలో మహిళలు ఒక్కసారే స్నానం.. దంపతులు మధ్య బంధమే ఓ వింత‌..!!

ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సంబంధాల్లో భార్యాభర్తలబంధం ఒకటి. ప్రేమ, అనురాగాలతో పాటు ఈ బంధంలో ఒకరికి ఒకరు అనే నమ్మకంతో ఉంటారు. అయితే కొంతమంది సంబంధాన్ని సిగ్గు లేకుండా అక్రమ సంబంధాలతో జతకట్టి హేళన చేస్తున్నారు. భర్త మరొక స్త్రీ తో లేదా భార్య తన భర్తకి ద్రోహం చేస్తూ మరొక పురుషుడితో సంబంధాన్ని కలిగి ఉంటూ అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రపంచంలో సాంప్రదాయాలు, నియమనిబంధనలకు భిన్నంగా ఉండే ఓ తెగ విచిత్ర ఆచారం ఏంటంటే భర్త స్వయంగా తన భార్యను తమ ప్రాంతానికి వచ్చే పర్యాటకులతో శారీరక సంబంధానికి పంపుతాడు. ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉందంటూ లాజిక్ చెప్తారు.

ఆ లాజిక్ తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇంతకీ ఈ తెగ పేరు చెప్పలేదు కదా హింబా అంటారు. వీరు నమీబియాలో నివసిస్తుంటారు. దేశం మొత్తం మీద ఈ తెగ జనాభా సుమారు 50 వేల వరకు ఉంటారు. వీరిలో చాలా విచిత్రమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ తెగకు సంబంధించిన మహిళలకు కేవలం జీవితం మొత్తంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. అది కూడా వివాహ సమయంలో మాత్రమే ఒక్కసారి చేస్తారు. ఇక ఆమె జీవితాంతం మళ్లీ స్నానం చేయదు. అయితే తన శరీరం శుభ్రంగా ఉంచుకోవడానికి దుర్వాసన రాకుండా అనేక మూలికాలను వాడుతూ ఉంటారట. వాటి సహాయంతో దుర్వాసనను తొలగించుకుంటారు.

మరో వింత ఆచారం ఏమిటంటే ఓ పర్యాటకుడు తమ గ్రామానికి వచ్చినప్పుడల్లా తమ వార్తలు స్వయంగా తమ భార్యలను ఆ పర్యాటకుల వద్దకు పంపిస్తారు. ఇలా చేయడం వల్ల తమ భార్యాభర్తల మధ్యన అసూయ భావం ఉండదని వారు నమ్ముతారట. ఇక మరో వింత ఆచారం ఏంటంటే సాధారణంగా ఒక బిడ్డ పుట్టినప్పుడు అతని వయసు భూమి మీద పడినప్పటి నుంచి లెక్కిస్తారు. అయితే ఈ హింబి తెగలో మాత్రం దీనికి ఆపోజిట్ గా ఒక స్త్రీ తన బిడ్డ పుట్టడం గురించి ఆలోచించిన క్షణం నుంచే ఆ బిడ్డ వయసును లెక్కిస్తారు.. పుట్టిన తేదీని కాదట. ఇది మనకు వింతగా అనిపించవచ్చు కానీ ఆ తెగలో పుట్టిన రోజు లెక్కింపు విషయంలో ఇదే చేస్తారు.